తల్లి దాడి.. తొమ్మిదేళ్ల కుమార్తె మృతి!

84చూసినవారు
తల్లి దాడి.. తొమ్మిదేళ్ల కుమార్తె మృతి!
సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల జాస్మిన్ అనే చిన్నారిపై ఆమె తల్లి సైరాబాను రాయితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గత కొంత కాలంగా సైరాబాను మానసిక స్థితి సరిగ్గా లేదని బంధువులు పేర్కొన్నారు. భర్త దూరమవ్వడంతో సైరాబాను తన కుమార్తెతో కలిసి బంధువుల ఇంట్లో నివసిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్