తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా, విరుదాచలం సమీపంలోని కచ్చిరాయనత్తం గ్రామంలో అక్టోబరు 26న ఒక ఆవు అరుదైన రీతిలో ఒకేసారి మూడు ఆడ దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన మహేశ్వరి పెంచుతున్న ఆవు, మూడు దూడలకు ఆరోగ్యంగా జన్మనివ్వడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆవుల్లో ఒకే ఈతలో మూడు దూడలు పుట్టడం చాలా అరుదైన విషయం. ప్రస్తుతం తల్లి ఆవు, మూడు దూడలు క్షేమంగా ఉన్నాయని, వాటిని చూసేందుకు గ్రామస్థులు తరలివస్తున్నారని సమాచారం.