TG: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ సమీపంలోని మంజీరా నదిలో సరిత తన ఇద్దరు కుమార్తెలు వైష్ణవి, శ్రావణితో కలిసి దూకినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఆమె తన తండ్రి బాలకిష్టయ్యకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. సంఘటనా స్థలంలో వారి చెప్పులు, సెల్‌ఫోన్ లభించాయి. ఎస్‌ఐ అహ్మద్ మోహియుద్దీన్ ఆదేశాలతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపును మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.