
ఎర్రవల్లిలో అధికారుల సర్వే పూర్తి.. 362 మందికి నోటీసులు
TG: గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి, కొండపాక మండలం వెలికట్ట గ్రామాల్లో భూములకు సంబంధించి అధికారుల సర్వే పూర్తయింది. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో 388 ఎకరాలు, వెలికట్టలోని సర్వే నంబర్ 271లో 118 మంది అనుభవదారులకు అధికారులు నోటీసులు జారీ చేసి, పొజిషన్ సర్వే నిర్వహించారు. ఎర్రవల్లిలో ఎనిమిది రోజులు, వెలికట్టలో ఐదు రోజులు సర్వే కొనసాగింది. ఈ సర్వే నివేదికను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు అందజేశారు, ఆయన ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సర్వే చేపట్టారు.




