ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎంపీ తన బిడ్డతో సభకు వచ్చింది.
ఆస్ట్రేలియా సెనేటర్ ఫాతిమా పేమన్ తన బిడ్డతో పార్లమెంట్‌కు హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో పాల్గొంటూనే బిడ్డను ఒడిలోకి తీసుకున్నారు. మాతృత్వం, ప్రజాప్రతినిధి బాధ్యతలను సమన్వయంగా పాటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.