
ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో శనివారం విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో, ఆదివారం కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నల్గొండ వంటి పలు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.




