
పదేళ్లలో మానవాళికి ముప్పు.. ఏఐపై మాజీ గూగుల్ ఇంజినీర్ హెచ్చరిక
మాజీ గూగుల్ ఇంజినీర్ నేట్ సోరెస్ కృత్రిమ మేధస్సు (AI) వల్ల రాబోయే పదేళ్లలో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ది అట్లాంటిక్’ పత్రికతో మాట్లాడుతూ.. భవిష్యత్తుపై అపనమ్మకంతో తాను రిటైర్మెంట్ పొదుపును కూడా ఆపేశానని వెల్లడించారు. ఎలిజర్ యుడ్కోవ్స్కీతో కలిసి ఆయన రాసిన పుస్తకం, శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు మానవ నియంత్రణను దాటితే వినాశనం తప్పదని హెచ్చరిస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ కూడా ఏఐపై ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేయడం గమనార్హం.




