
ఫేస్బుక్లో పరిచయం.ఇద్దరు పిల్లల తల్లిని ఇటుకతో కొట్టి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఫేస్బుక్ పరిచయంతో మొదలైన ప్రేమ వ్యవహారం దారుణ హత్యకు దారితీసింది. వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి అయిన 28 ఏళ్ల పింకీని, ఆమె ప్రియుడు పింటూ, అతని స్నేహితుడు ఆర్యన్ నవంబర్ 9న హత్య చేశారు. ఘటన జరిగిన రోజున వీరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, నిందితులు ఇటుకతో పింకీని కొట్టి చంపినట్లు సమాచారం. మృతదేహాన్ని పింకీ సోదరి గుర్తించగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.




