
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు.. కూటమి జోరు
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతుండగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తాజా ఫలితాల సరళిని పరిశీలిస్తే.. 140 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 78 స్థానాల్లో గెలుపొందగా, 2037 ఎంపీటీసీ స్థానాల్లో 1918 స్థానాలను కైవసం చేసుకుంది. సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నందున రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.




