‘మురసు’ ఎఫెక్ట్‌.. ఉప్పొంగుతున్న వాగులు

38చూసినవారు
‘మురసు’ ఎఫెక్ట్‌.. ఉప్పొంగుతున్న వాగులు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుఫాను ఒంగోలు సమీపంలో తీరం దాటడంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో వాగులు ఉప్పొంగి రాకపోకలు స్తంభించాయి. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు రైళ్లు, విమాన సేవలు నిలిచిపోయాయి. సహాయం కోసం గుంటూరు (9440827526), బాపట్ల (9281413774) కంట్రోల్ రూమ్‌లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్