AP: విజయనగరం జిల్లా కందిపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఓ వివాహిత, తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా ఉండేది. శ్రీను కూడా తన భార్యకు దూరంగా ఉంటూ ఆ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య తలెత్తిన ఘర్షణలో, వివాహిత తన ప్రియుడు శ్రీను తలపై ఇనుపరాడ్డుతో కొట్టి, ఆపై అతనిపై యాసిడ్ పోసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.