
ఉద్యోగులకు 1,000 ఎయిర్ ప్యూరిఫైర్లు కానుకగా ఇచ్చిన ఆస్ట్రోటాక్ (VIDEO)
నోయిడాకు చెందిన ప్రముఖ సంస్థ ఆస్ట్రోటాక్, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ తన ఉద్యోగులకు ఏకంగా 1,000 ఎయిర్ ప్యూరిఫైర్లను బహుమతిగా అందజేసింది. ఈ పంపిణీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఉద్యోగుల ఆరోగ్యం పట్ల కంపెనీ చూపుతున్న ఈ శ్రద్ధను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.




