ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్ అయ్యారు. సోమవారం ఆయన సంపద ఏకంగా 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.03 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. స్పేస్ఎక్స్, టెస్లా షేర్లు భారీగా లాభపడటంతో మస్క్ సంపద పెరిగింది. అక్టోబర్ ప్రారంభం నుంచి స్పేస్ఎక్స్ షేర్లు 13 శాతం, టెస్లా షేర్లు 6.7 శాతం ర్యాలీ అయ్యాయి. జూన్లో తొలిసారి ట్రిలియనీర్గా నిలిచిన మస్క్.. జులైలో షేర్ల పతనంతో ఆ హోదాను కోల్పోయారు.