మరో అద్భుతానికి సిద్ధమైన మస్క్

10చూసినవారు
స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్టార్‌షిప్‌ను ప్రత్యేక హ్యాండిల్స్‌ సాయంతో ప్రయోగ టవర్‌ వద్దే సురక్షితంగా ల్యాండ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో సూపర్‌ హెవీ బూస్టర్‌ను ‘చాప్‌స్టిక్స్‌’తో పట్టుకున్న స్పేస్‌ఎక్స్‌.. ఇప్పుడు రాకెట్‌ను కూడా తిరిగి అందుకునే సాంకేతికతపై దృష్టి సారించింది. ఈ విధానం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి వారానికి ఒకటి, ఆ తర్వాత రెండు స్టార్‌షిప్‌ ప్రయోగాలు చేపట్టగలమని మస్క్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్