తెలంగాణలో అధికారం కోల్పోయినా ప్రజల్లో మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న గౌరవం, ఆదరణ తగ్గలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్‌ను పోలిన 'శంకరన్న' పాత్రకు వచ్చిన స్పందన దీనికి నిదర్శనమని తెలిపారు. ఈ సినిమా కేవలం నాలుగు నిమిషాల పాత్రతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని,
కేసీఆర్ ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు.