నా ఆరోగ్యం మెరుగుపడుతోంది: వినోద్ కాంబ్లీ

1చూసినవారు
థానేలోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, కేర్ సెంటర్‌లో తాను సంతోషంగా ఉన్నానని కాంబ్లీ తెలిపారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కాంబ్లీ పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేర్ సెంటర్‌లో లభిస్తున్న సదుపాయాలు, ప్రేమతో కూడిన సంరక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్