TG: మూసీ కలుషితం నల్గొండ జిల్లా ప్రజలకు శాపమైందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బుదవారం తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి స్వార్థం, ఎవరిపైనా కోపం లేదు. ప్రకృతిని పరిరక్షించాలనేదే నా ఆలోచన. మూసీ పునరుద్ధరణలో ఎవరికీ నష్టం జరగకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. ప్రజాప్రతినిధులు బేషజాలు పక్కనపెట్టాలని కోరుతున్నా. మూసీకి సంబంధించి 21 కి.మీ మేర పనులు త్వరలో ప్రారంభిస్తాం. ఇప్పటికే అనుమతులు వచ్చాయి. టెండర్ దశలో ఉంది' అని అన్నారు.