ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తమ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని హీరోయిన్ శ్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్నిసార్లు అందులో ఉన్నది తానేనా అని అనుమానం వచ్చేంతగా ఫొటోలు మారుస్తున్నారని వాపోయారు. తన బ్రెస్ట్ సైజ్ పెంచడం, పై దుస్తులు తొలగించడం వంటివి చేస్తున్నారని అన్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలా వేధించడం సరికాదని ఆమె చెప్పుకొచ్చారు.