బల్మూరు మండలం - Balmoor Mandal

నాగర్ కర్నూల్ జిల్లా
Sep 12, 2026, 17:09 IST/

హరీష్ రావు అక్రమాల సాక్ష్యాలు అన్ని నా దగ్గర ఉన్నాయి: కవిత

Sep 12, 2026, 17:09 IST
TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా సిద్దిపేట జిల్లాలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని తన తండ్రి పేరు మీదకు మార్చుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ భూ దోపిడీకి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి పంపిస్తున్నానని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, హరీశ్ రావు మధ్య లోపాయికారీ ఒప్పందం లేకపోతే, ఈ భూ వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కవిత సవాల్ విసిరారు.