
దుర్గామాత గుడి వద్ద భక్తుల కోలాహలం, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం
నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలోని భగత్ సింగ్ ఏర్పాటు చేసిన దుర్గామాత గుడి వద్ద మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు కోలాటాలు, బతుకమ్మలు ఆడుతూ, భజనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.























