కోడేరు మండలం - Kodair Mandal

నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి కోర్టు భవన నిర్మాణ నిధుల కోసం ఎమ్మెల్యేకు వినతి
Sep 27, 2026, 16:09 IST/కల్వకుర్తి
కల్వకుర్తి

కల్వకుర్తి కోర్టు భవన నిర్మాణ నిధుల కోసం ఎమ్మెల్యేకు వినతి

Sep 27, 2026, 16:09 IST
కల్వకుర్తి కోర్టు భవన నిర్మాణ నిధుల మంజూరు కోసం ఆదివారం కల్వకుర్తి కోర్టు బాల అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి , శాలువాతో ఘనంగా సత్కరించారు. కోర్టు భవన నిర్మాణం కోసం తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. వెంటనే ఆర్ అండ్ బి ఎస్ సి కి ఫోన్ చేసి భవన నిర్మాణ ప్రతిపాదనలు తనకు అందజేయాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. మల్లేష్, ప్రధాన కార్యదర్శి జమీల్ అహ్మద్, ఉపాధ్యక్షుడు నాగరాజు, సీనియర్ న్యాయవాదులు వెంకట్ రెడ్డి, చిందం కృష్ణయ్య, భాస్కర్ రెడ్డి, వెంకట్ రమణ, లక్మణ్ రాజు ఉన్నారు.