
కోడేరు మండలంలో సిపిఎం బైక్ ర్యాలీలు
కోడేరు మండలంలో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని కోడేరు, కొండ్రావుపల్లి, ఎత్తం, నర్సాయిపల్లి, మైలారం, రాజాపూర్, రాజాపూర్ తాండా, నాగులపల్లి, నాగులపల్లి తాండా, జనుంపల్లి, తీగలపల్లి, పెద్దకొత్తపల్లి, దేవుని తిరుమలాపూర్ గ్రామాల్లో బైక్ ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను వివరించారు.





































