మాడ్గుల్ మండలం - Madgul Mandal

నాగర్ కర్నూల్ జిల్లా
సిద్ధిపేటలో ఉద్రిక్తత.. BJP, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
Oct 07, 2026, 09:10 IST/

సిద్ధిపేటలో ఉద్రిక్తత.. BJP, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

Oct 07, 2026, 09:10 IST
TG: సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. BJP, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రధాని మోదీ రాజకీయ జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం బీజేపీ సేవా జోతి యాత్ర చేపట్టింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. కాంగ్రెస్ యత్నాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో మహిళా కార్యకర్తలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. పోలీసులు రంగలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.