Sep 03, 2026, 16:09 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
మక్కజొన్న రవాణా చార్జీలు వెంటనే చెల్లించాలి: సీపీఎం
Sep 03, 2026, 16:09 IST
తాడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన మక్కజొన్నలకు రవాణా చార్జీలు వెంటనే చెల్లించాలని సీపీఎం పార్టీ తాడూరు మండల కార్యదర్శి అంతటికాశన్న గురువారం డిమాండ్ చేశారు. ధాన్యాన్ని రవాణా చేసిన లారీలు, ట్రాక్టర్లకు చార్జీలు చెల్లించాలని, గోనెసంచుల డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.