
పెళ్లయిన నెలకే ఎన్నారైకి భార్య షాక్.. బలవంతంగా పోటెన్సీ టెస్ట్
TG: హైదరాబాద్లో ఓ 27 ఏళ్ల కెనడియన్ పౌరుడు తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లైన నెలకే తన పాస్పోర్ట్, ఇతర కీలక పత్రాలను లాక్కొని, బలవంతంగా పురుషత్వ పరీక్ష (పోటెన్సీ టెస్ట్) చేయించి, రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు భార్య, మామతో సహా పలువురిపై బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు, భార్య కూడా భర్తపై మోసం, గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలతో బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
































