Sep 03, 2026, 16:09 IST/
నా తల్లికి అన్యాయం జరిగింది: కొండా సుస్మిత
Sep 03, 2026, 16:09 IST
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్రంగా స్పందించారు. తన తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, సీఎం రేవంత్ రెడ్డిని శపిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... తన తల్లి గొంతును ఎవరూ నొక్కలేరని, రేవంత్ రెడ్డి తన తల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత హోదాలో చేసినవేనని, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు.