Sep 08, 2026, 12:09 IST/
మండలి నుంచి MLCలు మధు, నవీన్ రెడ్డి సస్పెండ్
Sep 08, 2026, 12:09 IST
TG: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధు, నవీన్ రెడ్డిలను శాసనమండలి నుంచి సస్పెండ్ చేస్తూ మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా ఈ తీర్మానం నెగ్గింది. వీరి సస్పెన్షన్ ఈ సమావేశాల వరకు కొనసాగనుందని మండలి చైర్మెన్ తెలిపారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు.