
అదనపు ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయండి: ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ట్రాన్స్ కో సిఎండికి ఎమ్మెల్యే బాలు నాయక్ శుక్రవారం హైదరాబాద్ లో విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్లలో నీళ్లు తగ్గడంతో రైతులు బోర్ల మీద ఆధారపడుతున్నారని, లోవోల్టేజ్ ఏర్పడుతుందని తెలిపారు. సిఎండి ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత డి. వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.





















