హాలియా మండలం - Haaliya Mandal

నల్గొండ జిల్లా
శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలీ.. సీఐ
Sep 08, 2026, 12:09 IST/మునుగోడు నియోజకవర్గం
మునుగోడు నియోజకవర్గం

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలీ.. సీఐ

Sep 08, 2026, 12:09 IST
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై నాంపల్లి సీఐ దూది రాజు నిర్వాహకులతో మంగళవారం సమావేశమయ్యారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని, పోలీసుల అనుమతితో పాటు మండపాల ఏర్పాటు, విద్యుత్, లైటింగ్ వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద 24 గంటల భద్రతకు నిర్వాహకులే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.