Sep 12, 2026, 14:09 IST/
స్టైఫండ్ అడిగినందుకు విద్యార్దిని జుట్టు పట్టుకొని లాగిన పోలీస్ (వీడియో)
Sep 12, 2026, 14:09 IST
AP: తిరుపతిలో పారామెడికల్ విద్యార్థులు తమకు రావలసిన స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చేపట్టిన ఆందోళన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపడమే కాకుండా, ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని మగ పోలీస్ దారుణంగా ఈడ్చుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటన పోలీసుల జులంపై ప్రశ్నలు లేవనెత్తింది. విద్యార్థుల నిరసనపై పోలీసులు ప్రతాపం చూపడం విమర్శలకు దారితీసింది.