కేతేపల్లి మండలం - Kethepalle Mandal

నల్గొండ జిల్లా
మహిళా డిగ్రీ కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలి.. శివకుమార్
Sep 26, 2026, 14:09 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం

మహిళా డిగ్రీ కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలి.. శివకుమార్

Sep 26, 2026, 14:09 IST
నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకారులను ఎదిరించిన ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మహిళా డిగ్రీ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.