Sep 30, 2026, 06:09 IST/
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత (వీడియో)
Sep 30, 2026, 06:09 IST
లక్షద్వీప్ సమీపంలోని అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ అధికారులు సినీఫక్కీలో ఇరాన్ పడవను ఛేజ్ చేసి రూ.3,000 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పడవ నుంచి 526 కిలోల మెథాంఫెటమైన్, హెరాయిన్ను స్వాధీనం చేసుకుని, పడవను ముంబయికి తరలించారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీ నావికులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.