
పైప్ లైన్ లీకేజీతో వృధాగా పోతున్న నీరు
మర్రిగూడ మండలంలోని ఖుదాబక్షిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో త్రాగునీటి పైపులైన్ లీకై నీరు వృధాగా పోతున్నా పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడంలేదని ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శి పొట్ట అశోక్ ఆరోపించారు. లీకేజీతో నీరు వృధాగా పోవడమే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ పైపులైన్ లీకేజీకి మరమ్మత్తులు చేయాలని ఆయన కోరారు.





















