
ఫ్లై ఓవర్ పనులు త్వరగా పూర్తి చేయాలి.. డీవైఎఫ్ఐ
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనివల్ల ప్రజలు, వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని డీవైఎఫ్ఐ చిట్యాల మండల కార్యదర్శి కూనూరు గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫ్లైఓవర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
























