నకిరేకల్ మండలం - Nakrekal Mandal

నల్గొండ జిల్లా
గణేష్ ఉత్సవాల్లో DJలపై నిషేధం: నాంపల్లి పోలీసులు హెచ్చరిక
Sep 11, 2026, 17:09 IST/మునుగోడు నియోజకవర్గం
మునుగోడు నియోజకవర్గం

గణేష్ ఉత్సవాల్లో DJలపై నిషేధం: నాంపల్లి పోలీసులు హెచ్చరిక

Sep 11, 2026, 17:09 IST
నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో స్థానిక ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్గనైజర్లతో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి DJల వినియోగానికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, ప్రేరేపించినా లేదా DJలు వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలో ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని సూచించారు.