
కనగల్లులో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గంలోని కనగల్లు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కంబాల శివలీల, కంట్రోలర్ మట్టపల్లి వెంకటేశ్వర్లు, అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతల వెంకన్న, కవిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.




































