Sep 09, 2026, 09:09 IST/
తిరుమల భక్తులకు ప్రమాద బీమా పెంపు
Sep 09, 2026, 09:09 IST
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమానికి టీటీడీ పాలకమండలి పెద్దపీట వేసింది. భక్తులకు ప్రమాద బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, తిరుమలలో సహజ మరణం సంభవించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు LIC ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని, ఇందుకోసం రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే, ఉద్యోగుల సంక్షేమానికి, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచడానికి కూడా పలు నిర్ణయాలు తీసుకుంది.