Sep 07, 2026, 01:09 IST/
నేడు శ్రావణ బహుళ ఏకాదశి.. ఏం చేయాలంటే?
Sep 07, 2026, 01:09 IST
ఇవాళ శ్రావణ బహుళ ఏకాదశి. దీనిని అజ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజు విష్ణువు ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. పురాణాల ప్రకారం.. హరిశ్చంద్ర మహారాజు ఈ వ్రతాన్ని ఆచరించి కోల్పోయిన రాజ్యాన్ని, కుటుంబాన్ని తిరిగి పొందారు. పండితుల సూచనల మేరకు భక్తులు తెల్లవారుజామున తలస్నానం చేసి, ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగి ఆత్మశుద్ధిని పొందవచ్చని విశ్వసిస్తున్నారు.