శాలిగౌరారం మండలం - Shaligowraram Mandal

నల్గొండ జిల్లా
చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
Sep 26, 2026, 15:09 IST/మిర్యాలగూడ నియోజకవర్గం
మిర్యాలగూడ నియోజకవర్గం

చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

Sep 26, 2026, 15:09 IST
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి శ్రీ చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆమె విగ్రహానికి ఘనంగా శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ ఐలమ్మ ఆశయ సాధనకు, ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కొరకు పోరాడిన ఐలమ్మ   జయంతిని ఘనంగా నిర్వహించారు.