AP: విజయవాడలో ప్రముఖ హీరో నాని తన కొత్త చిత్రం 'ది ప్యారడైజ్' విజయవంతమైన సందర్భంగా బుధవారం హీరో నాని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, చిత్ర విజయం సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాని రాకతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.