Oct 16, 2026, 16:10 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
కొల్లంపల్లిలో ఘనంగా సర్వ ధర్మ సమ్మేళనం
Oct 16, 2026, 16:10 IST
నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామంలో శుక్రవారం హజ్రత్ సయ్యద్ షా ఖత్తల్ హుస్సేనీ (RH) సర్వ ధర్మ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్. రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మనుషుల్లోనే ధర్మం నిక్షిప్తమై ఉంటుందని, మనిషిని మనిషిగా గౌరవించినప్పుడే నిజమైన ధర్మం నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనానికి పలువురు హిందూ సర్వ పీఠాధిపతులు మరియు ప్రముఖులు హాజరై మానవతా విలువలపై సందేశాన్ని అందించారు.