
మక్తల్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆంజనేయులు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్ర సముద్రం ఎంపీహెచ్ పాఠశాల ఉపాధ్యాయుడు ఆంజనేయులు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. శుక్రవారం ఎంఈఓ కాజా అమీరుద్దీన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నాగార్జున, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



































