పాఠశాలల సమీపంలో కుక్కల బెడద

0చూసినవారు
పాఠశాలల సమీపంలో కుక్కల బెడద
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీలో వీధి కుక్కల బెడద మళ్లీ తీవ్రమైంది. మంగళవారం సంగంబండ రోడ్డులోని పాఠశాల సమీపంలో పదికి పైగా కుక్కలు సంచరిస్తుండటంతో స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో అధికారులు కుక్కలను తరలించినప్పటికీ, అవి మళ్లీ తిరుగుతుండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు ఉన్న ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరగక ముందే అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్