నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ శివారులో ఒక అక్రమ ఇసుక టిప్పర్ ను పట్టుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ బుధవారం రాయచూరు వైపు నుండి మరికల్ వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ TS07UH 9009 ఆపి తనిఖీ చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గుర్రాల రాజు యజమాని లక్ష్మీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుకను వడ్వాట్ వాగు నుండి అక్రమంగా తీసుకు వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.