నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం యాంకి గ్రామంలో శుక్రవారం బీజేపీకి చెందిన సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, 30 మంది నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్ఆర్ఐ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, నర్వ మండల
కాంగ్రెస్ అధ్యక్షులు బిసం చెన్నయ్య సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలకు
కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం, ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే కారణమని తెలిపారు.