Sep 11, 2026, 17:09 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
ఘనంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ జన్మదిన వేడుకలు
Sep 11, 2026, 17:09 IST
నారాయణపేట జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్వ మనోజ్ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, ఆత్మీయులు, శివన్న సైన్యం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బండి వేణుగోపాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బండి వేణుగోపాల్ కేక్ కట్ చేశారు. అభిమానుల ఆత్మీయత, కార్యకర్తల సందడి మధ్య ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.