పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తామని ప్రధాని నరేంద్ర
మోదీ స్పష్టం చేశారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలు నారీశక్తి భాగస్వామ్యాన్ని అడ్డుకోలేవని పేర్కొన్నారు. 2023లో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియమ్ అమలుకు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ముడిపడి ఉండగా, తాజాగా 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు-2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.