ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

13396చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి 2008-09 విద్యాసంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు పండుగ వాతావరణాన్ని సృష్టించారు. తమ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పాఠశాల తమ జీవితాలకు వేసిన పునాదికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్