
ఢిల్లీలో నకిలీ రూ. 20 నాణేల ముఠా గుట్టు రట్టు (VIDEO)
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నకిలీ రూ. 20 నాణేలను తయారు చేసి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకుంది. ముండ్కా ఇండస్ట్రియల్ ఏరియాలో పరాస్ జైన్‌ను 5,000 నకిలీ నాణేలతో అరెస్ట్ చేయగా, దర్యాప్తులో సోనిపట్‌లో ఈ యూనిట్ నిర్వహిస్తున్న ఉప్కార్ లూథ్రా అలియాస్ అభయ్ ప్రతాప్ సింగ్ పేరు బయటపడింది. పోలీసులు అతడితో పాటు అనురాగ్ పాల్, జనార్దన్ కుమార్ చౌరాసియాను కూడా అరెస్ట్ చేశారు. సుమారు లక్ష రూపాయల విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం ఈ ముఠా నెట్‌వర్క్‌పై మరింత దర్యాప్తు చేస్తున్నారు.




