కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు మద్దతిస్తున్నట్లు ఎన్సీపీ (శరద్ పవార్) ప్రకటించింది. ఈ మేరకు పార్టీ MPలకు విప్ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై '
ఇండియా' కూటమి పార్టీలు శనివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. అయితే
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న NCP (ఎస్పీ) కూటమి నిర్ణయంతో సంబంధం లేకుండా ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.